అదృశ్యమైన మహిళ శవం మంత్రాలయంలో లభ్యం | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన మహిళ శవం మంత్రాలయంలో లభ్యం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

హిందూపురం: పట్టణంలోని సత్యనారాయణ పేటకు చెందిన నేత్రావతి (35) శవం మంత్రాలయం తుంగభద్ర నది వద్ద గురువారం లభ్యమైంది. ఆరు రోజుల క్రితం నేత్రావతి కనిపించలేదని ఆమె కుమారుడు మురళి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అదృశ్యమైన నేత్రావతి మృతదేహం లభ్యమైనట్లు సీఐ అబ్దుల్‌ కరీం తెలిపారు. మంత్రాలయం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ సభ్యులు అక్కడే దహన సంస్కారాలు చేస్తున్నట్లు తెలిసింది.

రూ.30 లక్షల విలువైన కొరియర్‌

వస్తువులు చోరీ

పెనుకొండ రూరల్‌: కొరియర్‌ వాహనం నుంచి ల్యాప్‌టాప్‌, సెల్‌ ఫోన్‌ ఇతర విలువైన వస్తులు చోరికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కియా ఎస్‌ఐ డి. రాఘవయ్య తెలిపిన మేరకు.. బ్లూ కార్టు కొరియర్‌ వాహనం గత నెల 29న బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా, రూ.30 లక్షల విలువజేసే కొరియర్‌ వస్తువులు చోరీకి గురయ్యాయి. వాహన డ్రైవర్‌ వేణు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కియా ఎస్‌ఐ తెలిపారు.

ప్రాథమిక దశలో విద్యాభ్యాసం కీలకం

పుట్టపర్తి: విద్యార్థి జీవితం బంగారు మయం కావాలంటే ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం అందించాలని జిల్లా విద్యాధికారి కిష్టప్ప పేర్కొన్నారు. గురువారం కొత్తచెరువు బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ కార్యక్రమం ఆయన పాల్గొని, మాట్లాడారు. జిల్లాలో ఏడు కేంద్రాల్లో శిక్షణ ప్రారంభమైందన్నారు. ఒకటి, రెండు తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారి శిక్షణ తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ రాజశేఖర్‌ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారన్నారు. ఈ విధానాన్ని పాఠశాలల్లో ఇంప్లిమెంట్‌ చేస్తే విద్యార్థుల జీవితం బంగారు మయమవుతుందన్నారు. ఏడి లాజరు మాట్లాడుతూ ప్రాథమిక నైపుణ్యాలైన చదవడం, రాయడం పిల్లలకు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement