నార్పల: జిల్లాలో ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయిస్వామి (మొహర్రం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 17నుంచి ప్రారంభం కానున్నాయి. 29న చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈఏడాది ఉత్సవాలు నిర్వహణకు వందేళ్లు కానున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఇలా..
17న కుళ్లాయి స్వామివారి ప్రఽథమ దర్శనం, 18న స్వామివారి నిత్యపూజ నివేదన, 19న స్వామివారి అగ్నిగుండం ఏర్పాటు, 20న స్వామి వారిని నిలుపుట, 21న స్వామివారికి నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదో సరిగెత్తు, 23న స్వామివారి నిత్యపూజ నివేదన, 24న స్వామివారి ఏడో సరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి, 25న స్వామివారి నిత్యపూజ నివేదన, విడిదినం, 26న స్వామివారి గ్రామోత్సవం, పెద్దసరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి , అగ్నిగుండ ప్రవేశం, 27న స్వామివారి అగ్నిగుండ ప్రవేశం,సాయత్రం 4 గంటలకు జలధి, 29న స్వామివారి చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
29న స్వామివారి చివరి దర్శనం


