జిల్లా బాలికల ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా బాలికల ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

హిందూపురం టౌన్‌: శ్రీ సత్యసాయి జిల్లా ఫుట్‌బాల్‌ బాలికల సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ జట్లను గురువారం ఎంపిక చేశారు. పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా జట్లను ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా జట్ల ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ జట్లకు సంబంధించి మొత్తం 50 మందితో ప్రాబబుల్స్‌ ఎంపిక జరిగిందని, వీరికి టీమ్‌ క్యాంప్‌ నిర్వహించి తుది జట్ల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ బాలికల జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్‌ సలీం, ట్రెజరర్‌ శేఖర్‌, సభ్యులు ఆజాద్‌ బాషా, వ్యాయామ ఉపాధ్యాయులు లోక్‌నాథ్‌, రామాంజనేయులు, సురేష్‌ బాబు, రాఘవేంద్ర, కదిరప్ప, వినోద్‌, శివయ్య, శివప్రసాద్‌, కోచ్‌లు దుర్గాప్రసాద్‌, కృష్ణవేణి, జగదీష్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement