నరకానికి దారి | - | Sakshi
Sakshi News home page

నరకానికి దారి

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

పుట్టపర్తి అర్బన్‌: బుక్కపట్నం నుంచి కొత్తచెరువు మండలం బైరాపురం వరకూ ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా శిథిలం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 14 కిలో మీటర్లున్న రోడ్డుపై 1400కు పైగా గుంతలు ఏర్పడ్డాయి. బుక్కపట్నం మీదుగా కొత్తచెరువు, కమ్మవారిపల్లి, లోచర్ల, లింగారెడ్డిపల్లి క్రాస్‌, సాయినగర్‌, బైరాపురం వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిన్న వర్షం వచ్చినా మోకాలి వరకూ నీళ్లు నిలబడుతుండడంతో అవస్థలు పడుతున్నారు. తరచూ స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర, కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తదితరులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. గర్భిణులు, వృద్ధులు చివరకు 108 వాహనాలు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల మధ్య కనీసం వంద మీటర్లు కూడా సరైన రోడ్డు కనిపించదంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బుక్కపట్నం చెరువు కట్టపై ఉన్న గుంతలు

శిథిలావస్థలో బుక్కపట్నం–బైరాపురం రోడ్డు

14 కి.మీటర్లు 1400కు పైగా గుంతలు

తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు, వాహనదారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement