ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు
ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో నేతలు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇంతకాలమైనా భృతి ఊసే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. నిరుద్యోగ భృతిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నిధులు కేటాయించి ప్రతి నిరుద్యోగికి డబ్బులు అందజేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెబుతారు.
– సాయిఆదిత్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ


