యాప్‌ ద్వారా రుణాల రికవరీలు | - | Sakshi
Sakshi News home page

యాప్‌ ద్వారా రుణాల రికవరీలు

Feb 17 2026 7:24 AM | Updated on Feb 17 2026 7:24 AM

యాప్‌

యాప్‌ ద్వారా రుణాల రికవరీలు

ఏజీఎం కామాక్షయ్య

నెల్లూరు(పొగతోట): సీ్త్రనిధి రుణాలను యాప్‌ ద్వారా రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీ్త్ర నిఽఽధి ఏజీఎం కామాక్షయ్య ఏపీఎంలు, సీసీలు, మేనేజర్లకు సూచించారు. సోమవారం నెల్లూరు డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి సీ్త్ర నిధి మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఏజీఎం మాట్లాడారు. జిల్లాలో 1,219 గ్రామ సంఘాలున్నాయన్నారు. 819 సంఘాలు సీ్త్రనిధి రికవరీ యాప్‌ ద్వారా రుణాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. 150 గ్రామ సంఘాలకు వీఓఏలు లేరన్నారు. మిగిలిన 250 సంఘాలు రికవరీ యాప్‌ను వినియోగించడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ సంఘాలు ఆ యాప్‌ ద్వారా చెల్లింపులు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. యాప్‌ ద్వారా చెల్లింపుల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.

కారుణ్య నియామకపత్రాల అందజేత

నెల్లూరు(క్రైమ్‌): ముగ్గురు పోలీసు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద టైపిస్టులుగా ఉత్తర్వులను సోమవారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తన కార్యాలయంలో అందజేశారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ సూరి అంకయ్య మృతిచెందగా అతని కుమార్తె సింధూకు, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎంవీ శ్రీనివాసులురెడ్డి చనిపోగా అతని కుమారుడు సూర్యతేజరెడ్డికి, నవాబుపేట కానిస్టేబుల్‌ జి.శివకుమార్‌ మృతిచెందగా ఆయన సతీమణి స్వరూపకు నియామకపత్రాలను ఎస్పీ అందజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్పీ వారికి సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, ఏఓ చంద్రమౌళి, సూపరింటెండెంట్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై అలసత్వం తగదు

డీఆర్వో విజయ్‌కుమార్‌

నెల్లూరు(దర్గామిట్ట): ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం తగదని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన ఓ ఆర్డీఓ స్థాయి అధికారి, డీఎస్పీలకు మెమోలు జారీ చేసిన సంఘటనలు పలుచోట్ల జరిగాయన్నారు. వాటిని గుర్తించి జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ శాఖల బ్యాంక్‌ ఖాతాల వివరాలు వెంటనే నివేదించాలన్నారు. ఈపీటీఎఫ్‌ నమోదులో జిల్లాలో చాలామంది అధికారులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని తెలిపారు. అనంతరం శాఖల వారీగా పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగాభవాని, డీబీసీడబ్ల్యూఓ వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.65

సన్నవి : రూ.55

పండ్లు : రూ.35

యాప్‌ ద్వారా  రుణాల రికవరీలు1
1/2

యాప్‌ ద్వారా రుణాల రికవరీలు

యాప్‌ ద్వారా  రుణాల రికవరీలు2
2/2

యాప్‌ ద్వారా రుణాల రికవరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement