అయ్యా.. న్యాయం చేయండి
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● అర్జీలు స్వీకరించిన అధికారులు
నెల్లూరు(దర్గామిట్ట): ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మాపై కనికరం చూపండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి, డీపీఓ వసుమతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్ అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారికి రానున్న నెలలోపు పదోన్నతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఇల్లు కూల్చారంటూ ఆవేదన


