మహిళలను నమ్మించి.. వంచించారు | - | Sakshi
Sakshi News home page

మహిళలను నమ్మించి.. వంచించారు

Feb 17 2026 7:23 AM | Updated on Feb 17 2026 7:23 AM

మహిళలను నమ్మించి.. వంచించారు

మహిళలను నమ్మించి.. వంచించారు

టీడీపీ ప్రభుత్వం మహిళలను నమ్మించి నయవంచనకు గురి చేసింది. ఆడబిడ్డ నిధి, దీపం పథకం, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ వంటి పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరమైతే.. పైసా కూడా కేటాయించలేదు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకు రూ.5 వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ ఎలాంటి కేటాయింపులు జరగలేదు. దీంతో మహిళలకు ఆయా పథకాల ద్వారా రూపాయి కూడా లబ్ధి కల్పించే అవకాశం లేదని విస్పష్టమైంది. దీపం పథకానికి రూ.4,083 కోట్లు అవసరమైతే.. రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో సగం మందికి కూడా ఈ పథకం డబ్బులు జమవుతాయనే నమ్మకం కూడా లేదు. సంక్షేమ పథకాలకు సైతం కోతలు విధించడం అన్యాయం.

– తెనాలి నిర్మలమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు, పొదలకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement