జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల సత్తా

Feb 17 2026 7:23 AM | Updated on Feb 17 2026 7:23 AM

జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల సత్తా

నెల్లూరు (టౌన్‌): జేఈఈ మెయిన్స్‌లో సింహపురి విద్యార్థులు సత్తాచాటారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను గత నెల 21 నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు విడతల్లో నిర్వహించారు. ఫలితాలను నేషనల్‌ టెస్ట్‌ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. అందులో వేనాటి కుషాల్‌రెడ్డి 99.94, ఎం యశ్వంత్‌రెడ్డి 99.88, ఈ శివకుశ్వంత్‌ 99.86, సీ శరణ్య 97.42 శాతం సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.

ఆనందంగా ఉంది

శివకుష్వంత్‌ స్వస్థలం వేదాయపాళెం. తండ్రి జనార్ధన్‌ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా, తల్లి ప్రవీణ గృహిణి. కుష్వంత్‌ జేఈఈ మెయిన్స్‌లో 99.86 శాతం సాఽధించారు. మెయిన్స్‌లో మంచి పర్సెంటేజీ రావడం ఆనందంగా ఉందని, అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చదవడమే తన లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement