బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
నెల్లూరురూరల్ : కూటమి ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేదేమీ లే దని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొ న్నారు. సోమవా రం ఆయన రాష్ట్ర బడ్జెట్‌పై స్పందించారు. ఈ బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, అంకెల గారడీ, అభూత కల్పనలతో ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు. వాస్తవ పరిస్థితులకు బడ్జెట్‌లో చూపిన గణాంకాలకు ఏమాత్రం పొంతన లేవన్నారు. సూపర్‌సిక్స్ హామీలకు కూడా పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపులు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కొత్త పింఛన్లు ఇవ్వలేదన్నారు. ఈ రెండేళ్లలో ఎవరికీ 60 ఏళ్లు దాటలేదన్నట్లుగా ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బడ్జెట్‌లో ఆడబిడ్డ నిధి కోసం నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన మహిళలకు నిరాశే మిగిలిందన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు ఏటా రూ.18వేలు లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే నిరుద్యోగభృతి కింద ప్రతి నెలా రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదన్నారు. రైతులకు పంటల బీమా, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నాడు– నేడు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, మహిళల ఆసరాకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదన్నారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడిచాయన్నారు. ప్రస్తుత బడ్జెట్ చంద్రబాబు, కూటమి నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం రూపకల్పన చేసినట్లుగా ఉందన్నారు.
రెవెన్యూ ఉద్యోగులకు
పదోన్నతులు
నెల్లూరు(దర్గామిట్ట): ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షుశుక్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కే స్వర్ణలతకు డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి కల్పించి సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో నియమించారు. ఏఎస్‌పేటలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కే విజయ్‌కుమార్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎఫ్‌ఏసీ)గా పదోన్నతి కల్పిస్తూ నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్ట్‌లో పోస్టింగ్ ఇచ్చారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కే వెంకటేష్‌కు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి కల్పిస్తూ ఏఎస్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. నెల్లూరు టీజీపీ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కే లీలారాణికి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి కల్పిస్తూ కోట తహసీల్దార్ కార్యాలయంలో నియమించారు.


