హర్మన్‌ మెరుపులు | Team India won the toss and elected to bat first in the first T20I | Sakshi
Sakshi News home page

హర్మన్‌ మెరుపులు

Apr 18 2026 3:59 AM | Updated on Apr 18 2026 3:59 AM

Team India won the toss and elected to bat first in the first T20I

భారత్‌ 157/7 

దక్షిణాఫ్రికాతో తొలి టి20

డర్బన్‌: టి20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (33 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... జెమీమా రోడ్రిగ్స్‌ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు. మూడో వికెట్‌కు జెమీమాతో కలిసి హర్మన్‌ 71 పరుగులు జోడించింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (13), రిచా ఘోష్‌ (5), కాశ్వి గౌతమ్‌ (10) విఫలమయ్యారు. 

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్‌ బృందం... టి20లకు అవసరమైనంత వేగంగా ఆడటంలో విఫలమైంది. ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియా 33 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా కడపటి వార్తలు అందేసరికి 10 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులు చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement