టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమిపై పోస్ట్‌మార్టం

T20 WC 2022: Team India Fans Should Not Blame Players Or Coach For Semis Defeat - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌-2022లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను నిం‍దిస్తున్నారు. సోషల్‌మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తిస్తూ, మన పరువును మనమే బజారుకీడ్చుకునేలా చేస్తున్నారు.

అసలు వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఘోర ఓటమికి కారణలేంటని విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి జట్టు సెలెక్టర్లే ప్రధాన కారణమన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జట్టు ఎంపికలో వారు చేసిన తప్పిదాలే టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాయన్నది అందరూ గమనించాల్సిన అంశం.

బౌలింగ్‌లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంలో ఘోర వైఫల్యం, టాపార్డర్‌ బ్యాటింగ్‌లో ఒక్క లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ను కూడా ఎంపిక చేయకపోవడం, ప్రత్యామ్నాయ స్పెషలిస్ట్‌ ఓపెనర్‌ను ఎంపిక చేయాలన్న ధ్యాసే లేకపోవడం, మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల శ్రేయస్‌ అయ్యర్‌ను కాదని దీపక్‌ హుడాను ఎంపిక చేయడం, హార్ధిక్‌ లాంటి నాణ్యమైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను గుర్తించలేకపోవడం, ఫినిషర్‌ అంటూ దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేసి ఘోర తప్పిదం చేయడం, టీ20లకు అస్సలు సూట్‌ కాని అశ్విన్‌ను ఎంపిక చేయడం, కనీసం బౌలింగ్‌కు న్యాయం చేయలేని అక్షర్‌ పటేల్‌ను ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంపిక చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ వరల్డ్‌కప్‌ జట్టు ఎంపికలో చాలా ఘోర తప్పిదాలే చేసింది.

వీటన్నిటి కంటే ముఖ్యంగా నిఖార్సైన పేసర్లను గుర్తించి, వారిని సానబెట్టడంలో సెలెక్టర్లతో పాటు బీసీసీఐ, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ విషయంలో వీరినే ప్రధానంగా నిందించాలి. నాణ్యమైన పేసర్లను తయారు చేసుకునేందుకు వరల్డ్‌కప్‌కు ముందు చాలా సమయం దొరికినప్పటికీ.. కేవలం ఒకరిద్దరిని పట్టుకుని వేలాడారే తప్పించి, యంగ్‌ టాలెంట్‌ను అన్వేశించి, వారిని సానబెట్టాలన్న ఆలోచన చేయలేకపోయారు.

ఆస్ట్రేలియా పిచ్‌లకు సూటయ్యే ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌ లాంటి యువ పేసర్లను పరిగణలోకి తీసుకోకుండా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. సెలెక్టర్లు, బీసీసీఐ, ఎన్‌సీఏ చేసిన ఇన్ని తప్పిదాలను పక్కకు పెట్టి, కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓడినందుకు క్రికెటర్లను, కోచ్‌ను నిందించడం ఎంత వరకు సబబో భారత అభిమానులు ఆలోచించాలి.

అభిమానులు ఎదో బాధలో ఆటగాళ్లను నిందించారంటే ఓ అర్ధం ఉంది. కొందరు భారత మాజీలయితే తమ స్థాయిని మరిచి కెప్టెన్‌ను, సీనియర్‌ ఆటగాళ్లను, కోచ్‌ను టార్గెట్‌ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, అశ్విన్‌, షమీ, దినేశ్‌ కార్తీక్‌లు టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకోవాలని, టీమిండియా ఓటమికి నైతిక బాధ్యత వహించి కోచ్‌ తప్పుకోవాలని వారు కోరడం విడ్డూరంగా ఉంది.   
చదవండి: రాహుల్‌ ద్రవిడ్‌కు విశ్రాంతి.. టీమిండియా కోచ్‌ ఎవరంటే..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2022
Nov 12, 2022, 10:07 IST
ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య రేపు (నవంబర్‌ 13) జరిగే టీ20 వరల్డ్‌కప్‌-2022 అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరు జట్లు...
12-11-2022
Nov 12, 2022, 09:13 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో అదృష్టం కలిసొచ్చి ఫైనల్‌ దాకా చేరిన పాకిస్తాన్‌.. రేపు (నవంబర్‌ 13) జరుగబోయే టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌తో...
12-11-2022
Nov 12, 2022, 04:35 IST
ఏడాది వ్యవధిలో జరిగిన గత టి20 ప్రపంచకప్‌కు, ఈ సారి టి20 ప్రపంచకప్‌ మధ్య భారత జట్టు ప్రదర్శనలో తేడా...
11-11-2022
Nov 11, 2022, 21:32 IST
క్రికెట్‌లో కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్‌లను చోకర్స్‌ అని పిలుస్తుంటారు. ఇక చోకర్స్‌ అనే ముద్ర...
11-11-2022
Nov 11, 2022, 20:00 IST
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఫైనల్‌కు వెళ్లిందనగానే పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజాకు కొమ్ములొచ్చాయి. టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగకక్కాడు. పాకిస్తాన్‌...
11-11-2022
Nov 11, 2022, 19:04 IST
పాక్‌ దిశను మారుస్తున్న ఆసీస్‌ దిగ్గజం.. బ్యాటింగ్‌ కోచ్‌ నుంచి మెంటార్‌గా
11-11-2022
Nov 11, 2022, 18:49 IST
విశ్రాంతి తీసుకుని తీసుకుని రోహిత్‌ అలసిపోయాడు! ఏడుగురు కెప్టెన్లు ఉంటే ఇలాగే!
11-11-2022
Nov 11, 2022, 17:40 IST
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్‌...
11-11-2022
Nov 11, 2022, 17:14 IST
T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌-2022 మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌ను ఓడించగానే.. క్రికెట్‌ ప్రేమికుల్లో ఎక్కడా లేని...
11-11-2022
Nov 11, 2022, 15:58 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో...
11-11-2022
Nov 11, 2022, 15:46 IST
ICC Men's T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ఆరంభమైన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ముగింపు...
11-11-2022
Nov 11, 2022, 15:07 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో...
11-11-2022
Nov 11, 2022, 14:21 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో...
11-11-2022
Nov 11, 2022, 09:49 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే తొలి టీ20 ప్రపంచకప్‌...
11-11-2022
Nov 11, 2022, 08:34 IST
‘ఫలితాలతో సంబంధం లేకుండా మ్యాచ్‌ ఆసాంతం దూకుడుగా ఆడటమే మా కొత్త  విధానం. గత ఏడాది కాలంగా ఇదే తరహా...
11-11-2022
Nov 11, 2022, 06:37 IST
సులాహ్‌: హిమాచల్‌ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా...
11-11-2022
Nov 11, 2022, 04:56 IST
‘నేను మళ్లీ ప్రపంచకప్‌ ఆడతానని అనుకోలేదు’... సెమీస్‌ ముగిసిన తర్వాత అలెక్స్‌ హేల్స్‌ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు...
11-11-2022
Nov 11, 2022, 04:47 IST
ఏడాది వ్యవధిలో మరోసారి భారత క్రికెట్‌ అభిమానులను మన జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. గత టి20 ప్రపంచకప్‌లో...
10-11-2022
Nov 10, 2022, 22:24 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం సెమీస్‌తోనే ముగిసింది.  కచ్చితంగా ఫైనల్‌ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి...
10-11-2022
Nov 10, 2022, 21:32 IST
టి20 వరల్డ్కప్ 2022లో టీమిండియా కథ ముగిసింది. కచ్చితంగా ఫైనల్‌ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి... 

Read also in:
Back to Top