ట్రెండింగ్‌ పాటకు భారత క్రికెటర్స్‌ అదిరిపోయే స్టెప్పులు

Indian Womens Cricket Team Members Ace Tum-Tum-Dance Trend Viral Video - Sakshi

టీమిండియా మహిళా క్రికెటర్లు విశాల్‌ 'ఎనిమి' సినిమాలోని 'టమ్‌ టమ్‌(Tum Tum)' పాట​కు అదిరిపోయే స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా మహిళా బృందం టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టి20 ట్రై సిరీస్‌లో ఆడుతుంది. అయితే గురువారం ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ సహా దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోనూ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ వీడిమోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'స్లేయింగ్‌ ది ట్రెండ్‌' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగా.. ముక్కోణపు టోర్నీ విజేతగా ఆతిథ్య దక్షిణాఫ్రికా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది.

అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా కూడా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్లో ట్రైఆన్‌ (32 బంతుల్లో 57 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించి జట్టును గెలిపించింది. భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచింది. ఈ నెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. 

చదవండి: ఆస్ట్రేలియా సాధన షురూ..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top