T20 WC 2022: హార్దిక్‌ పాండ్యా చెత్త రికార్డు.. తొలి భారత ఆటగాడిగా!

Hardik Pandya becomes first Indian to be dismissed hit wicket T20 WC - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా కథ ముగిసింది. ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. భారత ఇన్నింగ్స్‌ అఖరి బంతికి హార్దిక్‌ హిట్‌ వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.

తద్వారా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హిట్‌ వికెట్‌గా ఔటైన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్‌ నిలిచాడు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌లో ఈ చెత్త రికార్డు నెలకొల్పిన జాబితాలో హార్దిక్‌ మూడో స్ధానంలో ఉన్నాడు. అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యా క్రికెటర్‌ డేవిడ్ ఒబుయా, 2021 పొట్టి ప్రపంచకప్‌లో నసీం ఆహ్మద్‌ హిట్‌వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరారు.

అదరగొట్టిన హార్దిక్‌
ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 33 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. టీమిండియా 168 పరుగులు సాధించడంలో హార్దిక్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం పాండ్యా నిరాశపరిచాడు. 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పాండ్యా 34 పరుగులు సమర్పించుకున్నాడు.

చదవండి: WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top