ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనుల పరిశీలన

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): తంగళపల్లి శివారులో రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ పనులను కలెక్టర్‌ హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న విద్యాసంస్థ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండల నడుమ పచ్చని ప్రకృతి మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. పనులన్నింటినీ నిర్దేశిత కాల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement