కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

సిద్దిపేటఅర్బన్‌: వానాకాలం సాగు పనులు ప్రారంభమైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి సమీపంలో రైతులు రాస్తారోకో చేశారు. రోడ్డుపై సుమారు గంటన్నర పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధానయం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. స్థానిక అధికారులు స్పందించి లారీలు త్వరగా వచ్చేలా చూసి ధాన్యాన్ని తరలించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు మండిపడ్డారు. అర్బన్‌ తహసీల్దార్‌ అక్కడికి చేరుకొని లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement