దుబ్బాక: త్వరలోనే అర్హులైన పేదలందరికీ కొత్త పింఛన్లు అందించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. గురువారం భూంపల్లి– అక్బర్‌పేట మండలం నగరం రామలింగేశ్వర ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలోని 594 మంది లబ్ధిదారులకు రూ.5.94 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హైమావతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని 10 వేల ఇళ్లు మంజూరు కాగా 80 శాతం గ్రౌండింగ్ అయ్యాయన్నారు. జిల్లాలో కొత్తగా 45 వేల రేషన్ కార్డులు అందించామన్నారు. స్కూల్ పిల్లలకు కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ పథకంతో పాటు ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నభోజనం అందించనున్నామన్నారు. రైతులు ఏమాత్రం అధైర్యపడవద్దని ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.
కోర్టు భవన నిర్మాణ స్థలం పరిశీలన
దుబ్బాక పట్టణంలో కొత్తగా కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి వివేక్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాత ఆస్పత్రి ఆవరణలోనే కోర్టు భవనం నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు మంత్రికి విన్న వించారు.
గ్యారంటీలన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ


