ఉపాధిహామీ కూలీల రక్షణకై ఉద్యమిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ కూలీల రక్షణకై ఉద్యమిస్తాం..

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

ఉపాధిహామీ కూలీల రక్షణకై ఉద్యమిస్తాం.. ● 12న జిల్లా మహాసభలు ● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత శశిధర్‌

● 12న జిల్లా మహాసభలు ● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత శశిధర్‌

కొమురవెల్లి(సిద్దిపేట): ఉపాధిహామీ కూలీల రక్షణకై ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్‌ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో ఉల్లంపల్లి సాయిలు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పేరును తొలగించి వీబీజీ రాంజీ చట్టాన్ని అమలుచేసి కార్మికుల పొట్టకొడుతోందన్నారు. పాత చట్టాన్నే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా 12న కొమురవెల్లిలో నిర్వహించనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తాడూరి రవీందర్‌, పాశికంటి బాలరాజు, మ్యాకల మల్లేశం, కానుగుల రాజు, తాడూరి కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement