వెంకటరమణకు విశిష్ట సాహిత్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వెంకటరమణకు విశిష్ట సాహిత్య పురస్కారం

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

వెంకటరమణకు విశిష్ట సాహిత్య పురస్కారం

బెజ్జంకి(సిద్దిపేట): సిద్దిపేట డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు, విద్యారత్న అవార్డు గ్రహీత నారోజు వెంకటరమణ విశిష్ట సాహిత్య పురస్కారం పొందారు. ఆంద్రప్రదేశ్‌లోని రాజమండ్రి గ్లోబల్‌ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పూర్వ కులపతి, ఎంఎల్‌సీ కేవీవీ సత్యనారాయణ చేతుల మీదుగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకున్నారు. చైతన్య సారస్వత పరిషత్‌, శ్రీశ్రీ కళావేదికల ఆధ్వర్యంలో 7, 8వ తేదీలలో జరిగిన మహాసభలకు ఆమె సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పురస్కారం అందుకున్నట్టు వెంకటరమణ మంగళవారం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement