గజ్వేల్‌రూరల్: అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ బైక్ మెకానిక్‌కు చెలిమి ఫౌండేషన్ అండగా నిలిచింది. పట్టణానికి చెందిన మెకానిక్ తూం దేవేందర్ ఇటీవల అనారోగ్యానికి గురైన సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం చేయించేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు స్పందించారు. బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించి రూ.15 వేలు, వారి మిత్రబృందం సహకారంతో మరో రూ.25 వేలు అందించి మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గుంటకు శ్రీను, ఆంజనేయులు, శ్రీనివాస్, నర్సింహులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


