మార్వాడీ వ్యాపారులు వద్దంటూ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మార్వాడీ వ్యాపారులు వద్దంటూ ఆందోళన

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రమైన శివ్వంపేటలో మార్వాడీ వ్యాపారులు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయకూడదంటూ స్థానిక వర్తక, వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మార్వాడీ గో బ్యాక్‌ అంటూ ఆదివారం ర్యాలీ నిర్వహించి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్తక, వ్యాపార సంఘం అధ్యక్షుడు యాదగిరిగౌడ్‌, ఉపాధ్యక్షులు మురళి, విజయ్‌, ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ మాట్లాడారు. ఇప్పటికే గ్రామంలో నెలకొల్పిన మార్వాడీల దుకాణాల వల్ల స్థానిక వ్యాపారులు ఉపాధి కోల్పోయారన్నారు. కొత్తగా మరికొందరు దుకాణాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. వ్యాపారులు నర్సింహులు, హన్మంత్‌గుప్తా, రమేశ్‌గుప్తా, భాస్కర్‌గుప్తా, సింహంగుప్తా, వెంకటేశ్‌, నాగరాజు, అంజి, సంతోష్‌, సంపత్‌, ప్రభుచారి, సందీప్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement