అక్కన్నపేట(హుస్నాబాద్): రోడ్డుకు రెండు వైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు కాలి బూడిదయ్యాయి. మండలంలోని నందారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నందారం స్టేజీ నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు రెండు వైపులా హరితహారంలో భాగంగా మూడేళ్ల కిందట సుమారు 100కుపైగా మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి పెరిగి నీడనిస్తున్నాయి. రెండు రోజుల కిందట రోడ్డుకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల రైతులు నిప్పుపెట్టి సుమారు 32 చెట్లను బుగ్గిపాలు చేశారు. దీంతో పంచాయతీ పాలకవర్గం ముగ్గురు రైతులను గుర్తించి జరిమానా విధించింది. అందు లో బొమ్మరాజుకు రూ.4 వేలు, పెర్క ఎల్లయ్యకు రూ.2 వేలు విధించగా, మూడో వ్యక్తి జరిమానా కట్టేందుకు ముందుకు రాకపోవడంతో కేసు నమోదు చేయిస్తామని పంచాయతీ కార్యదర్శి తిరుపతి తెలిపారు.
● నిప్పు పెట్టిన రైతులు
● జరిమానా విధించిన అధికారులు


