ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముస్లిం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(మేవా) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు షాజీద్, బాసిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా సయ్యద్ షౌకత్‌అలీ, అధ్యక్షుడిగా ఫకృద్దీన్, ఉపాధ్యక్షుడిగా గౌస్, సయ్యద్ సందాని, ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్, కార్యదర్శులుగా మిస్‌బావుద్దీన్, అలం, కోశాధికారి అజీత్ ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపికయ్యారు. కార్యక్రమంలో మేవా సభ్యులు పాల్గొన్నారు.
నల్లపోచమ్మదేవీ.. కరుణించుతల్లీ..
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌స్పెక్టర్, ఆలయ ఇన్‌చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివ్వప్ప, రాజేశ్ అమ్మవారికి పంచామృతంతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వాహనాలకు పూజలు చేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.


