కమిషనర్ సస్పెండ్ ..
బాణసంచా కాల్చిన బాధితుడు
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సస్పెన్షన్ నేపథ్యంలో శనివారం కార్యాలయం ఎదుట వివేకానంద నగర్ కాలనీకి చెందిన కనకయ్య బాణసంచా కాల్చి హల్‌చల్ చేశాడు. 17వార్డులో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా కమిషనర్ రద్దు చేసినట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాట్లలో విఫలం పేరిట అధికారులు ఇటీవల కమిషనర్‌ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే.


