రహదారి.. ఫలాలహారం | - | Sakshi
Sakshi News home page

రహదారి.. ఫలాలహారం

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

తొలి విడతలో 20 కిలో మీటర్లు.. 20వేల మొక్కలు

కాలుష్య నియంత్రణతోపాటుకోతులకు ఆహారం

హరితంగా మెదక్‌, సిద్దిపేట, ఎల్కతుర్తి జాతీయ రహదారి

సాక్షి, సిద్దిపేట: భూ భాగంలో 33శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, నూతనంగా రోడ్ల నిర్మాణం, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరిగిపోతున్నాయి. దీంతో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) పర్యావరణ పరిరక్షణ , జీవవైవిధ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రీన్‌ హైవేస్‌ పాలసీలో భాగంగా జాతీయ రహదారులకు ఇరువైపులా పండ్ల, పూల, ఔషధ మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెదక్‌–ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీలో లక్ష పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు.

మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి 134 కిలో మీటర్లను రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్నారు. దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. దీంతో రోడ్డు నిర్మాణం సమయంలో భారీ వృక్షాలను తొలగించడంతో నీడ, పచ్చదనం కరువైంది. రోజు రోజుకు వాహనాల రాకపోకలు పెరుగుతుండటంతో పొల్యూషన్‌ ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. దీంతో వాహనాలు పూర్తిస్థాయిలో పెరగకముందే రోడ్డుకు ఇరువైపులా లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించారు. జాతీయ రహదారుల వెంట పచ్చదనాన్ని పెంపొందించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, కోతులు, వన్యప్రాణులకు ఆహారాన్ని అందించడానకి పండ్ల మొక్కలను నాటనున్నారు.

ఇరువైపులా లక్ష పండ్ల

మొక్కలు నాటేలా ప్రణాళిక

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement