సిద్దిపేటలో గ్రీన్ ర్యాలీ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో శనివారం గ్రీన్‌ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘ప్లాస్టిక్‌ను నిరిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం’అని నినాదంతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ బోర్డు సమన్వయకర్త రవీందర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)


