తుర్క కాశీలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

తుర్క కాశీలకు అండగా ఉంటాం

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

రాబోయేది తమ ప్రభుత్వమేనని, తుర్కకాశీలకు జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తామని హరీశ్‌రావు అన్నారు. శనివారం విపంచి ఆడిటోరియంలో ఎమ్మెల్సీ అమీర్‌ ఖాన్‌ సహకారంతో తుర్కకాశీలకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 4వేల కోట్లు పెట్టి 1100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ 5కోట్ల నిధుల కేటాయింపు హామీ విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక రూ 50కోట్లు పెంచి మీ జీవితాల్లో వెలుగులు నిండేలా చూస్తామన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా అమీర్‌ ఖాన్‌ సేవ చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తనవంతు తుర్కఖాసీలకు 50 రాళ్లు కొట్టే మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ అమీర్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ మాట్లాడుతూ.. హరీశ్‌ నమ్మకానికి ప్రతీకగా అభివర్ణించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మస్కత్‌ అలీ, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్స్‌, తుర్క ఖాసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బడే సాబ్‌, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement