గుర్తింపు ప్రేరణగా నిలవాలి: పీసీసీ చీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు ప్రేరణగా నిలవాలి: పీసీసీ చీఫ్‌

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

ర్యావరణ పరిరక్షణలో హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు దక్కడంతో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌లను అభినందించారు. శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ లక్ష్మి వారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ సాధించిన గుర్తింపు మరింత ప్రేరణగా నిలవాలన్నారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని వారు ఆకాక్షించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ హస్సెన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement