● దేశంలోనే రెండో షోలాపూర్‌గా సిద్దిపేట ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: భవిష్యత్తులో మన దేశానికి రెండో షోలాపూర్‌గా సిద్దిపేట మారే అవకాశం ఉందని, ఇప్పటికే వీవర్స్, స్టిచ్చింగ్ రంగం విస్తరించిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రశాంత్‌నగర్‌లో దుస్తుల తయారీ పరిశ్రమను ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ తయారీ విధానం తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోడ్లు, బిల్డింగ్‌లు, కాలేజీలు, దేవాలయాలు కట్టడం మాత్రమే నిజమైన అభివృద్ధి కాదని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి స్వశక్తి మీద నిలబడేలా చేయడమే నిజమైన అభివృద్ధిగా అభివర్ణించారు. గతంలో సిద్దిపేటలో 6వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. దేశంలో 60వేల కోట్ల టెక్స్ టైల్ బిజినెస్‌లో 70శాతం స్టిచ్చింగ్ రంగానిదే ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు.


