హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు వరించింది. బెస్ట్ ఇన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డును రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రదానం చేశారు. శుక్రవారం హైదరాబా ద్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం అందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్, పర్యావరణ అధికారి రవి కుమార్‌లు అవార్డును అందుకున్నారు.
మంచి పరిణామం
మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో పర్యావరణ పనితీరుపై అవార్డు రావడం మంచి పరిణామమని స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో గతంలో అనేక జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అవార్డులు రావడం వెనుక పాలకవర్గం, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఉందన్నారు. హుస్నాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అన్నారు.


