చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో అప్పటికే రేషన్ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం వాపస్ తీసుకోకుండా.. పంపిణీ చేయకుండా నిలిపి వేయడంతో రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పురుగుల పాలవుతోంది. మార్కెట్లో దొడ్డు బియ్యానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని వివిధ రేషన్ షాపుల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పౌరసరఫరా, రెవెన్యూ అధికారులు ఇప్పటికై నా మేలుకొని దొడ్డు బియ్యం సంగతి తేలిస్తే బాగుంటుంది.


