కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట, తిమ్మా రెడ్డిపల్లి, బందారం గ్రామాల సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి నిధుల మంజూరయ్యేలా చూడాలని కోరుతూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో వివిధ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు మంజూరు కాకపోవడంతో ప్రజల్లో చులకన, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటున్న విషయాన్ని సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో నిధులు మంజూరయ్యేలా చూస్తామంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బూర్గుల మానస, కొయ్యెడ వెంకటేశం, కొలుపుల గంగాధర్, నాయకులు శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.


