మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అందెలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ యాదగిరి నేతృత్వంలో బుధవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండల నేపథ్యంలో పనిప్రదేశాలల్లో చల్లని నీటితో పాటు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ఎక్కువగా తీసుకోవాలని కూలీలకు అవగాహన కలిగించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
సలాఖపూర్ గ్రామంలో..
మద్దూరు(హుస్నాబాద్): ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని సలాఖపూర్ గ్రామంలో ఉపాఽధి హామీ కూలీలకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్‌లను ఉప సర్పంచ్ చెట్టె ఐలయ్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనికా, అనిల్‌కుమార్, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కిష్టయ్య, సంతోష, చంద్రశేఖర్, రాకేశ్, ఐల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


