పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం | - | Sakshi
Sakshi News home page

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

హుస్నాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి అన్నారు. పలువార్డుల్లో 20 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.6.12 లక్షల విలువగల చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లికాని ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, సంపత్‌ నాయక్‌, రమేశ్‌, బత్తుల స్వరూప, రాజు, నాయకులు వెంకటరమణ, పున్న సది తదితరులు పాల్గొన్నారు.

మనోధైర్యమే ఆయుధం

సిద్దిపేటకమాన్‌: క్యాన్సర్‌ నివారణకు మనోధైర్యమే మొదటి ఆయుధమని సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి రేడియేషన్‌ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్‌ రామకృష్ణ ప్రసాద్‌ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యాన్సర్‌ పెషేంట్లకు రేడియేషన్‌ ఆంకాలజీ విభాగంలో ‘హైపర్‌సైట్‌’ అనే నూతన సాంకేతిక పద్ధతి ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్‌ కణాలు ఉన్న ప్రాంతానికి రేడియేషన్‌ అందించడంతో మిగతా శరీర భాగాలపై దుష్ప్రభావాలు తక్కువగా ఉంటా యని చెప్పారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిసుపత్రి ప్రతినిధులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.5 కోట్ల

మొక్కజొన్నల కొనుగోలు

తొగుట(దుబ్బాక): పీఏసీఎస్‌ ద్వారా రూ.5 కోట్లు విలువజేసే మొక్కజొన్నలు కొనుగోలు చేశామని సీఈఓ గంగారెడ్డి తెలిపారు. స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌యార్డులో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సుమారు రెండు నెలలపాటు మొక్కజొన్నలు కొనుగోలు చేశామని చెప్పారు. తొగుట మండల రైతులతో పాటు దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించారని, 544 మంది రైతుల నుంచి 20,643 క్వింటాళ్లుకొనుగోలు చేశామని తెలిపారు. సుమారు రూ 4,95432ల విలువజేసే ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సహకరించిన అధికారులు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సిబ్బంది శేఖర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మనోభావాలను

కించపరిస్తే సహించం

సిద్దిపేటజోన్‌: తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించబోమని కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌గౌడ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణపై అనుచిత వ్యాఖ్య లు చేస్తూ ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చగొట్టద్దన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనసేన కార్యకర్తలు మంత్రి పొన్నం ఇంటిపై దాడికి యత్నించడాన్ని ఖండించారు. నాయకులు నాగరాజు, భరత్‌ సాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

నాణ్యమైన విద్య

మద్దూరు(హుస్నాబాద్‌): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని నర్సాయిపల్లి సర్పంచ్‌ శనిగరం సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు సుంకరి రాజేశం అన్నారు. నరసయ్యపల్లి గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలకు

వత్తాసు పలుకుతారా?

గజ్వేల్‌: అక్రమ నిర్మాణాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ బుధవా రం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కార్యాల యం ఎదుట ఫ్లెక్సీ కట్టి పలువురు నిరసన తెలిపారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపడుతున్న వారికి అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు అక్రమార్కులకు మాత్రం అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అధికారుల వైఖరి మారకపోతే సహించేదిలేదని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement