సీసీ రోడ్డు పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని 11వ వార్డు మైసమ్మగుడి సమీపంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముస్త్యాల అరుణ కౌన్సిలర్‌ ఎజాజ్‌ అహ్మద్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణంతో పజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వార్డు అభివృద్ధికి అవసరమైన మరిన్ని సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఉమ, కౌన్సిలర్లు గీతాంజలి, రాజేశ్వరి, సుప్రజ, దుర్గయ్య, సురేశ్‌, సదానందం, షరీఫా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement