రోబోటిక్స్‌ ఎక్స్‌పో పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్స్‌ ఎక్స్‌పో పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 18 2026 8:35 AM | Updated on Feb 18 2026 8:35 AM

రోబోటిక్స్‌ ఎక్స్‌పో పోస్టర్‌ ఆవిష్కరణ

రోబోటిక్స్‌ ఎక్స్‌పో పోస్టర్‌ ఆవిష్కరణ

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో భౌతిక శాస్త్ర విభాగం, ఆంత్రప్రెన్యూర్షిప్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్‌ సెల్‌ సంయుక్తంగా ‘‘ఇన్నోబోట్స్‌ – ఇన్నోవేషన్‌ – రోబోటిక్స్‌ ఎక్స్‌పో 2026’’ ను ఈ నెల 24న కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత తెలిపారు. మంగళవారం కళాశాలలో ఎక్స్‌పోకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ప్రతిపాదించే వినూత్న ఆలోచనలు, రోబోటిక్స్‌ నమూనాలు, సైన్స్‌ టెక్నాలజీ ప్రాజెక్టులను ఒకే వేదికపై ప్రదర్శించడానికి ఈ ఎక్స్‌పో అవకాశం కల్పిస్తుందన్నారు. యువతలో సృజనాత్మకత, పరిశోధనాత్మక దృక్పథం, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ ఎక్స్‌పోలో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వినూత్న ఆలోచనలతో ఉన్న ప్రజలు పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు డాక్టర్‌ మధుసూదన్‌, డాక్టర్‌ అయోధ్యరెడ్డి, గురుచరణ్‌ దాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement