గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పటాన్‌చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం... ముత్తంగి డివిజన్ పరిధిలోని చెరువు కట్టపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయసు సుమారు (49) ఏళ్లు ఉంటాయని తెలిపారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


