విద్యార్థుల్లో భావోద్వేగాలు గుర్తించాలి
టేక్మాల్(మెదక్): విద్యార్థులలో భావోద్వేగాలను గుర్తించాలని పాఠశాల హెచ్‌ఎం ప్రసన్నవదన తెలిపారు. మంగళవారం మండలంలోని కుసంగి ఉన్నత పాఠశాలలో సామాజిక భావోద్వేగ శ్రేయస్సు (చెలిమి) కార్యక్రమంపై అవగాహన కల్పించారు. చెలిమి నోడల్ ఉపాధ్యాయులు రమావత్ శంకర్ కార్యక్రమం ఉద్దేశం, లక్ష్యాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సమాజం, విద్యార్థులు ఎలాంటి సామాజిక భావోద్వేగాలకు గురవుతున్నారో గుర్తించి నియంత్రించాలన్నారు. సామాజిక, కుటుంబ ప్రతికూల పరిస్థితులు విద్యార్థి శారీరక, మానసిక ఉద్వేగ, ప్రవర్తనలపై ప్రభావం చూపుతాయని చెప్పారు. పాఠశాల స్థాయిలో వాటిని గుర్తించి అధిగమించడానికి గ్రూప్ ఆక్టివిటీస్, మైండ్ ఫుల్నెస్, లీడర్షిప్ తదితర నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాండురంగం, అశోక్, రమేశ్ గౌడ్, మురళి, కల్యాణి, సుభాష్, నాగేందర్ రెడ్డి, రాకేశ్, మల్లేశ్, మొగులయ్య పాల్గొన్నారు.


