సెల్‌ఫోన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులకు సెల్‌ఫోన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువత కోసం సెల్‌ఫోన్ రిపేర్‌లో మార్చి 5 నుంచి ఉచిత శిక్షణ అందించనున్నారు. 19 నుంచి 45 ఏళ్ల లోపు యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గలవారు 94901 03390, 94901 29839 నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఒకేషనల్ కోర్సులతోనే ఉపాధి: డీఈఓ విజయ
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థి దశ నుంచే ఉపాధినిచ్చే ఒకేషనల్ కోర్సులపై ఆసక్తి చూపా లని జిల్లా విద్యాధికారి విజయ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో పీఎంశ్రీ కింద మంజూరైన బ్యూటీ అండ్ వెల్నెస్ కోర్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇతర ఉపాధినిచ్చే కోర్సులపై ఆసక్తి చూపితే రాబోయే రోజుల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుమోహన్, శివరాజ్, శృతి, సిబ్బంది, విద్యార్థినులు ఉన్నారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధి
పనుల పరిశీలన
జహీరాబాద్ టౌన్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జహీరాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను మంగళవారం దక్షిణ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను సమీక్షించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్ ఆధ్వర్యంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సుధీర్ బండారి, శ్రీనివాస్ గుప్త, కౌన్సిలర్లు శ్రవణ్, బోగ్గుల సంతోష్ జనరల్ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రూ. 25 కోట్లతో చేపడుతున్న రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. పూర్ణ నుంచి తిరుపతి వెళ్లే రైలును జహీరాబాద్ స్టేషన్‌లో ఆపాలని వారు కోరారు.
పరిశ్రమలో పేలుడు..
తప్పిన ప్రాణ నష్టం
జిన్నారం (పటాన్‌చెరు): పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటన గుమ్మడిదల మండల పరిధిలోని హారికా డ్రగ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం... పరిశ్రమ మొదటి అంతస్తు ఎంబీ– 3 బ్లాక్‌లో సాయంత్రం 7:30 గంటలకు డ్రయ్యర్ పరికరంలో ముడి పదార్థాలను లోడ్ చేసి ఉంచారు. దీంతో షార్ట్ సర్క్యూట్ జరగడంతో బ్లాక్ గోడలు ఒక్కసారిగా ధ్వంసం కావడంతో భారీ శబ్దం నెలకొంది. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనకు ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సెల్‌ఫోన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ


