జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వ భూముల అప్పగింత
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్ పరిధిలో అన్యాక్రాంతానికి గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించి రెవెన్యూ అధికారులు జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. మంగళవారం ఈ మేరకు సర్వే నం. 284లో 28.5 గుంటలు, 243లో 10.5 గుంటల ప్రభుత్వ భూమిని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జయప్రకాశ్ నారాయణ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ పవన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహులుకు పంచనామా నిర్వహించి అధికారిక ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా పార్కులు ఏర్పాటు చేసి ప్రహరీ గోడ నిర్మించి రక్షణ చర్యలు చేపడతామని టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది నవీన్, ప్రశాంత్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


