మద్యం మత్తులో ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కె.వెంకటపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామంలోని కడవేర్గు వెంకటస్వామి(41) తన వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు ఉన్న శారీరక వైకల్యంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. దీంతోపాటు అప్పుడప్పుడు ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటి బయట ఉన్న గదిలో నిద్రపోయాడు. వారి కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి ఇంటి బయట ఉన్న చీరతో చేసిన ఊయలలో మెడ చిక్కుకొని మృతి చెందిన స్థితిలో కనిపించాడు. మద్యం మత్తులో ఉరి వేసుకొని ఉండవచ్చని మృతుని తల్లి బుదవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి భార్య నమితతో పాటు పదేళ్ల లోపు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు.


