వెబ్‌కాస్టింగ్‌ సెంటర్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వెబ్‌కాస్టింగ్‌ సెంటర్‌ పరిశీలన

Feb 17 2026 7:20 AM | Updated on Feb 17 2026 7:20 AM

వెబ్‌కాస్టింగ్‌ సెంటర్‌ పరిశీలన

వెబ్‌కాస్టింగ్‌ సెంటర్‌ పరిశీలన

● మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌

సిరిసిల్ల అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కార్యాలయాల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుండగా వెబ్‌కాస్టింగ్‌ సెంటర్‌ నుంచి పరిశీలించారు. అంతకుముందు వేములవాడలో కౌన్సిల్‌ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

మాజీ చైర్‌పర్సన్‌ ఆరోపణలు అవాస్తవం

వేములవాడ: మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మాజీ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి ఆరోపణల్లో వాస్తవం లేదని వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌ పేర్కొన్నారు. తాను ఎలాంటి ప్రలోభాలకు గురికాలేదన్నారు. వార్డు సమస్యల పరిష్కారం కోసం వీరితో కలసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. తనను గుర్తించే మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవి ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement