దొంగ ఏడ్పులతో గెలిచిన ఈటల ఏం చేశారు: రేవంత్‌ రెడ్డి

TPCC Chief Revanth Reddy in open meetings - Sakshi

ఎమ్మెల్సీ కోసం ‘పాడి’ కాంగ్రెస్‌కు ద్రోహం చేశారు: రేవంత్‌రెడ్డి 

సుదీర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారు  

దొంగ ఏడ్పులతో గెలిచిన ఈటల ఏంచేశారు? 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది 

జమ్మికుంట, మానకొండూరు, దుబ్బాక, హైదరాబాద్‌ సభల్లో టీపీసీసీ చీఫ్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి, సిద్దిపేట/వనస్థలిపురం/ముషిరాబాద్‌/దిల్‌సుఖ్‌నగర్‌: ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చెల్లని నోటు. దానిని జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు దారులను ఓడించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వవద్దని శపథం చేశానని, కాంగ్రెస్‌ను మోసం చేసిన మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని, దొరలపాలన పోవాలంటే ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో బలిదానాలతో తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తాడనుకుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. విద్యార్థుల బలిదానాలు ఆపాలనే సంకల్పంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగులను వంచిస్తూ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారన్నారు.

గురువారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, రేణికుంటలో, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజావిజయభేరి సభల్లో, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ముషీరాబాద్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ల్లో రేవంత్‌ ప్రసంగించారు. 

ఈటలది నయవంచన.. 
ఏడుసార్లు హుజూరాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ నియోజకవర్గ ప్రజలను నయవంచనకు గురి చేశారని రేవంత్‌ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా తీసుకురాలేని అసమర్థ నాయకుడని దుయ్యబట్టారు. దొంగ ఏడ్పులు ఏడ్చే ఈటల ఏమీ చేయలేదన్నారు.

ఇప్పుడేమో హుజూరాబాద్‌ ప్రజలను విడిచి గజ్వేల్‌లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ హుజూరాబాద్‌లో కోవర్టులు (పరోక్షంగా పాడి కౌశిక్‌) పోటీ చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాడి కౌశిక్‌ ఎమ్మెల్సీ పదవి, కమీషన్ల కోసం కాంగ్రెస్‌కు ద్రోహం చేశారన్నారు.

పిల్లి తన పిల్లల రక్షణ కోసం ఇల్లిల్లూ మార్చినట్లు.. కేసీఆర్‌ తాను, తన కుటుంబ సభ్యులకు పదవుల కోసం నియోజకవర్గాలు మారుస్తున్నారని ఎద్దేవాచేశారు. ఉద్యమ సమయంలో సిద్దిపేటలో ఉన్న కేసీఆర్‌ తర్వాత కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్‌కు చేరారని, ఇప్పుడు కామారెడ్డికి పారిపోయారన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాను కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని కరీంనగర్‌ జిల్లాలో కలుపుతామన్నారు.  

చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూం కట్టిస్తా 
రాష్ట్రంలో డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు కాబోతుందని, కేసీఆర్‌ రిటైర్‌ అవుతారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయనకు కూడా పింఛన్‌ ఇస్తామని, చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తానని చెప్పారు. కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండటానికి కచ్చితంగా ఇల్లు కట్టిస్తానన్నారు. కేసీఆర్‌ దోచుకున్న రూ.లక్ష కోట్లు కక్కిస్తానని హెచ్చరించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ అయిందని,  ప్రజలకు బొందల తెలంగాణగా మారిందని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ ఫాంహౌస్‌ దగ్గర పెద్ద జీతగానిలాగా ఉన్నాడని విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌ రావు దుబ్బాక అభివృద్ధికి ఏమైనా కృషి చేశారా అని ప్రశ్నించారు. 2018లో ఎల్‌బీనగర్‌లో మీరు సుదీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని దునుమాడారు. ఎల్‌బీనగర్‌లో మధుయాష్కీగౌడ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

హైదరాబాద్‌లో పేదలకు ఏ కష్టం వచ్చినా అంజన్‌కుమార్‌యాదవ్‌ అందుబాటులో ఉంటారని, వరుణ దేవుడు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరి అంజన్‌ను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రణవ్‌ (హుజూరాబాద్‌), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి (దుబ్బాక), మధుయాష్కీగౌడ్‌ (ఎల్‌బీనగర్‌) తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-11-2023
Nov 24, 2023, 10:40 IST
మెదక్‌/తూప్రాన్‌: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌...
24-11-2023
Nov 24, 2023, 10:21 IST
సాక్షి,ఆదిలాబాద్‌: బోథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల ప్రచారం...
24-11-2023
Nov 24, 2023, 10:18 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
24-11-2023
Nov 24, 2023, 10:16 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘రాం రామే.. రాజన్న. ఏం సంగతే. ఇయ్యల్ల పొద్దెక్కుతున్న ఓళ్లస్తలేరు.. సలిగూడ రెండొద్దుల సంది జరంత ఎక్కనే ఉన్నదే....
24-11-2023
Nov 24, 2023, 09:46 IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్‌ఓలు ఓటర్‌ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం...
24-11-2023
Nov 24, 2023, 09:36 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
24-11-2023
Nov 24, 2023, 09:33 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
24-11-2023
Nov 24, 2023, 09:21 IST
మహబూబ్‌నగర్‌: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ...
24-11-2023
Nov 24, 2023, 09:12 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్‌ బ్యాలెట్‌ మిస్సింగ్‌ అవ్వడం ఆదిలాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం...
24-11-2023
Nov 24, 2023, 09:05 IST
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. టెకీలతో పాటు ఐటీ...
24-11-2023
Nov 24, 2023, 08:59 IST
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే...
24-11-2023
Nov 24, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి...
24-11-2023
Nov 24, 2023, 04:36 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో హ్యాట్రిక్‌ విజయం లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితి సర్వశక్తులూ...
24-11-2023
Nov 24, 2023, 04:29 IST
సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని...
24-11-2023
Nov 24, 2023, 04:22 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందని...
23-11-2023
Nov 23, 2023, 15:17 IST
ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ సంపదను మేం పెంచేలా చూస్తున్నాం, కానీ.. 
23-11-2023
Nov 23, 2023, 14:04 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది....
23-11-2023
Nov 23, 2023, 13:39 IST
ప్రాజెక్టుల విషయంలో ఇలా జరగడం సహజం. ఆ మాత్రం దానికే విమర్శలు చేయడం.. 
23-11-2023
Nov 23, 2023, 12:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల...
23-11-2023
Nov 23, 2023, 12:17 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని... 

Read also in:
Back to Top