MLA Rajasingh Comments On Asaduddin Owaisi - Sakshi
Sakshi News home page

BJP MLA Rajasingh: మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్‌.. సంచలన వ్యాఖ్యలు 

Aug 25 2022 3:47 PM | Updated on Aug 25 2022 6:05 PM

MLA Rajasingh Comments On Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. రెండోసారి అరెస్ట్‌కు ముందు ఆయన స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చదవండి: రాజాసింగ్‌కు ఊహించని షాక్‌.. ఇలా జరిగిందేంటి?

‘‘నేను మహ్మద్‌ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్‌ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు. పాతబస్తీలో ఒవైసీ మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నా తల నరుకుతామని నినాదాలు చేస్తున్నారు’’ అని రాజాసింగ్‌ అన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేసినవారిపై ఎన్ని కేసులు పెట్టారు అంటూ రాజాసింగ్‌ ప్రశ్నించారు. నన్ను ఇవాళ రాత్రి, లేదా తెల్లవారుజామున అరెస్ట్‌ చేస్తారనే సమాచారం అందింది. పాత కేసుల్లో అరెస్ట్‌ చేయాలని కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement