ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..? | INDIA Bloc's 1st Coordination Committee Meeting On September 13 - Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..?

Published Tue, Sep 5 2023 11:02 AM | Last Updated on Tue, Sep 5 2023 11:55 AM

INDIA Bloc 1st Coordination Committee Meeting In September 13 - Sakshi

ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న జరగనుంది. దేశ రాజధానిలోని ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్ ఇంట్లో భేటీ కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. నేడు(మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి ప్రచార కమిటీ మొదటిసారిగా సమావేశమవనుంది. 

ఇండియా కూటమికి ప్రచార కమిటీని 19 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆ కమిటీకి మరో ఇద్దరు సభ్యులను కొత్తగా చేర్చారు. డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీకి చెందిన మహబూబ్ బేగ్‌ను నూతనంగా ఆ కమిటీలో చేర్చారు. 

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఐక్యంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబయిలో సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ భేటీల్లో కూటమి ఏర్పాటు, దాని నియమాలు, లక్ష‍్యాలపై చర్చించుకున్నారు.

తాజాగా ముంబయిలో జరిగిన భేటీలో కూటమికి ఓ సమన్వయ కమిటీతో పాటు ప్రచార కమిటీని కూడా నియమించారు. ఇవి కూటమి సభ్యులను సమన్వయ పరచడంతోపాటు ఎన్నికల ప్రచార వ్యూహాలను నిర్ణయిస్తాయి. వచ్చే నెల నుంచి కూటమి చెందిన పార్టీల ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. 

ఇదీ చదవండి: బీజేపీ vs ఇండియా: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement