గ్యాస్ బ్లాక్ దందా, అధిక వసూళ్లపై అధికారులు నియంత్రణ లేక ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారుల వద్ద ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారు. అధిక వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలి.
– సూర శ్యామ్, పెద్దపల్లి
ఏజెన్సీలు రద్దు చేయాలి
లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ నిర్వాహకులు, వర్కర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తే అధికారులు వెంటనే ఏజెన్సీలు రద్దు చేయాలి. అధికంగా వసూలు చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. రవాణా చార్జీలు కేంద్ర ప్రభుత్వమే ఏజెన్సీ నిర్వాహకులకు అందజేస్తుంది. సబ్సిడీ ద్వారా కేంద్రం డొమెస్టిక్ సిలిండర్లను సరఫరా చేస్తుంది.
– కర్రె సంజీవరెడ్డి,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి


