గ్యాస్‌ ఏజెన్సీల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఏజెన్సీల ఇష్టారాజ్యం

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

పెద్దపల్లి: ప్రజలు కట్టెల పొయ్యిపై వంట చేయడం వల్ల కాలుష్యంతో పలు రకాల రోగాల బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో 90 శాతం ప్రజలకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. కాగా, కనెక్షన్‌ తీసుకొమన్నప్పుడు ఉన్న ఉత్సాహం సిలిండర్‌ సరఫరా చేసినప్పుడు ఏజెన్సీ నిర్వాహకులు, ఉద్యోగులకు ఉండడం లేదని విమర్శలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.1,015 ఉండగా, ఏజెంట్లు, సరఫరాదారులు రూ.1,100 వరకు తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. సిలిండర్‌ సరఫరా సమయంలో పలువురు ప్రశ్నిస్తే.. శ్రీతీసుకుంటే తీసుకో.. లేకుంటే తీసుకొని వెళతాశ్రీ.. అనే సమాధానం వస్తుందని, దీనిపై సివిల్‌ సప్లై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు.

రవాణా బాధ్యత ఏజెన్సీలదే..

పలు రకాల ఏజెన్సీలకు గ్యాస్‌ కంపెనీలే రవాణా చార్జీలు జమ చేస్తాయి. సిలిండర్‌ను లబ్ధిదారుల ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత ఏజెన్సీ నిర్వాహకులదే. కానీ, నిర్వాహకులు మాత్రం వర్కర్లను పెట్టుకొని లబ్ధిదారుల వద్ద రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న అధికారులు నోరు మెదపడం లేదు.

ఐదు కిలోమీటర్లు దాటితేనే..

నిబంధనల ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపు ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. 5 నుంచి 30 కిలోమీటర్ల లోపు అయితే వినియోగదారులు రూ.10 చెల్లించాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు.

సిలిండర్‌ డెలివరీకి నిర్వాహకులు, రవాణాదారుల అధిక వసూళ్లు

పట్టించుకోని సంబంధిత అధికారులు

జిల్లాలో

కమర్షియల్‌ కనెక్షన్లు 79046

డొమొస్టిక్‌ కనెక్షన్లు 88,897

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement