జీవ వైవిద్య పరిరక్షణతోనే మనుగడ | - | Sakshi
Sakshi News home page

జీవ వైవిద్య పరిరక్షణతోనే మనుగడ

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

మంథనిరూరల్‌: జీవ వైవిద్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని మంథని ఇన్‌చార్జి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎంవీ నాయక్‌ అన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మంథని మండలం ఖానాపూర్‌ శివారులోని ఎల్‌ మడుగు అటవీప్రాంతంలో విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. అడవులతోనే సంమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. అంతకు ముందు అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్పంచ్‌ సంగెం అరుణ గట్టయ్య, పెద్దపల్లి ఎఫ్‌ఆర్వో సతీశ్‌కుమార్‌, డెప్యూటీ రేంజ్‌ అధికారులు తిరుపతి, కొమురయ్య, దేవదాస్‌, ఎఫ్‌ఎస్‌వోలు నర్సయ్య, మంగీలాల్‌, రహ్మతుల్లా, ఎండీ అమీరుద్దీన్‌, ప్రవీణ్‌, ఎప్‌బీవోలు శ్రీకాంత్‌, మాధురి, రజిత, మేఘరాజ్‌, ప్రదీప్‌, అక్తర్‌పాషా, రామ్‌సింగ్‌ పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ నిర్మూలనపై అవగాహన

జ్యోతినగర్‌(రామగుండం): పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవరసరమని రామగుండం ప్రాంతీయ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ కనకజ్యోతి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎన్టీపీసీ టెంపరరి టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిర్మూలనపై ఎన్‌సీసీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిత్యజీవితంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడానికి పాటించాల్సిన నియమాలు, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలను విద్యార్థులకు వివరించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. కో ఆర్డినేటర్‌ తిరుపతి, అంజన్‌కుమార్‌ పాల్గొన్నారు.

వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి

ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు అధిక ఆదాయం అందించే వాణిజ్యపంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి గడ్డం శ్యాంప్రసాద్‌ అన్నారు. గురువారం మండలంలోని లోకపేటలో ఆయిల్‌పాం తోటలను సందర్శించారు. తోట నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం తదితర అంశాలను తెలుసుకున్నారు. ఆయిల్‌పాం సాగుపై అందించే సబ్సిడీలను సద్వి నియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. తిరుమల ఆయిల్‌ కెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో కేశు కల్యాంకర్‌, అధికారులు మహేశ్‌, రాము, మహేశ్‌, అభిలాష్‌ పాల్గొన్నారు.

నలుగురు ఎస్సైల బదిలీ

గోదావరిఖని: కాళేశ్వరం జోన్‌పరిధిలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ఝా ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్‌ మంచిర్యాలలో పనిచేస్తున్న కె.నరేశ్‌ను ఎస్‌హెచ్‌వో పెద్దపల్లికి బదిలీ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌హెచ్‌వో ఎన్‌.మధూకర్‌ను సీసీఎస్‌ రామగుండం కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎస్‌బీ ఎస్‌ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్‌రావును సీసీఎస్‌ రామగుండం, ఇటీవలే పెద్దపల్లి ఎస్‌హెచ్‌వోగా బదిలీ అయిన బి.జీవన్‌ను సీసీఎస్‌ పెద్దపల్లికి బదిలీ చేశారు.

మాజీ ఎమ్మెల్యేలపై కేసు

గోదావరిఖని(రామగుండం): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఎదుట ఈనెల 9న అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై గురువారం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మల్కాపూర్‌ రోడ్‌లో నిరసన చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసినట్లు వివరించారు. బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement