ఒకప్పుడు చేతి కొడవళ్లతో వరి కోసి, కట్టలు కట్టి, అల్గం పెట్టి, ఎడ్ల బంతి కొట్టి, గాలికి తూర్పారబట్టి వడ్ల రాశులు పోసేవారు. ప్రస్తుతం యంత్రాలతో నాట్లువేసి, మందులు చల్లి, కోతలు కోసి అక్కడే అమ్మకాలు జరుపుతున్నారు. కాగా, కోతల సమయంలో రైతులు పశుగ్రాసం తెచ్చి గడ్డికుప్పలు వేసేవారు. కానీ, ఇప్పుడు ఆధునిక యంత్రాలతో అక్కడికక్కడే కట్టలు కడుతున్నారు. ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ శివారులో పొలం నిండా గడ్డి కట్టలు వనంలా కనిపించాయి. తాటిచెట్ల వనంలో గడ్డి కట్టలు చూపరులను మురిపిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


