పెద్దపల్లిరూరల్: కుటుంబ తగాదాలతో ఠాణాకు వచ్చే దంపతులకు ఓపికగా కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి జీవించేలా ప్రోత్సహించాలని ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. గురువారం పెద్దపల్లిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు 506 పిటిషన్లను విచారించి పరిష్కారం చూపినట్టు గమనించి సీఐ రమేశ్‌బాబు, ఎస్సై రాజమణితో పాటు సిబ్బందిని అఽభినందించారు. చిన్న సమస్యలను పెద్దవిగా భావించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి సమస్య ఓపికగా విని, భేదాభిప్రాయాలు సమసిపోయేలా చేసి వారి భవిష్యత్తు జీవితాన్ని ఆనందంగా గడిపేలా సూచనలివ్వాలన్నారు.


